Rajinikanth | 32 ఏళ్ళ తర్వాత మణిరత్నం-రజనీకాంత్ కాంబోలో మూవీ?
Rajinikanth-Maniratnam Movie | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఈ కాంబోలో మూవీ వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో సూపర్‌స్టార్ రజనీకాంత్, మణిరత్నం కాంబో ఒకటి. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన దళపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Rajinikanth-Maniratnam Movie | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఈ కాంబోలో మూవీ వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో సూపర్‌స్టార్ రజనీకాంత్, మణిరత్నం కాంబో ఒకటి. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన ‘దళపతి’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 1991లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా కమర్షియల్గానూ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను రాబట్టింది. మణిరత్నం బెస్ట్ చిత్రాల లిస్ట్ తీస్తే.. దళపతి సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. సినిమా వచ్చి ముప్పై రెండేళ్లయిన ఇప్పటికీ కొత్త ఫీల్‌ను ఇస్తుంటుంది.
ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ కాంబినేషన్లో 32ఏళ్ళ తర్వాత మరో సినిమా రాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానున్నట్లు టాక్. ఇక రజనీ లైకా ప్రొడక్షన్ సంస్థలో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా అందులో ఒక చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం మణిరత్నం ‘PS-1’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ‘PS-2’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనున్నాడు. సెకండ్ పార్టు తర్వాతే రజనీతో సినిమా పట్టాలెక్కనుంది. ఇక రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు.
Read Also:
NC22 | నాగచైతన్య సినిమాలో నేషనల్ అవార్డు హీరోయిన్?
Prince Movie | ‘ప్రిన్స్’ మూవీకి భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?
Allu Sirish | అల్లు శిరీష్ కొత్త సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
Michael Movie | సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీ టీజర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

