RC16 Director | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చరణ్ నటన వర్ణనాతీతం. ఈయన నటనకు ఇండియాలోనే కాదు గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈయన లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘RC15’ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే చిత్రం నుండి లీకైన రామ్‌చరణ్, అంజలి పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఆ ఫోటోలలో అంజలి, రామ్‌చరణ్‌కు భార్యగా కనిపించింది. వింటేజ్ లుక్‌లో ఉన్న చరణ్ పోస్టర్‌పై మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో చరణ్ తండ్రి, కొడుకుగా రెండు పాత్రలో కనిపించనున్నాడు.
కాగా ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్, ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల కాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే చరణ్ 16వ సినిమాను కన్నడ దర్శకుడు నార్తన్ తెరకెక్కిస్తున్నట్లు కొన్ని రోజుల క్రీతం ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు వినిపిస్తుంది. ఇటీవలే విక్రమ్‌తో సంచలన విజయం సాధించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో RC16 తెరకెక్కుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. లోకేష్ ప్రస్తుతం విజయ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కార్తితో ఖైదీ సీక్వెల్ తెరకెక్కించనున్నాడు. ఇక ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాతే రామ్‌చరణ్ సినిమా పట్టాలెక్కనుందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కుతున్నట్లు టాక్.
Read Also:
Oridevuda Movie | ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పాన్ ఇండియా హీరో..!
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు దర్శకుడిగా ముందుగా సుకుమార్‌ను అనుకున్నారా..!
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!