Rc15 Movie | ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు రామ్‌చరణ్. ఈ సినిమాతో తన నటనపై విమర్శలు కురిపించిన వాళ్ల నోటికి తాళం వేశాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంతో గ్లోబల్‌గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన లెజండరీ డైరెక్టర్ శంకర్‌తో RC15 చేస్తున్నాడు. మాములుగానే శంకర్ సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడేకంగా చరణ్‌తోనే సినిమా చేయనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. శంకర్ సినిమాల్లో ప్రతి నటుడిగా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ క్రమంలో పాత్రకు ఎవరు షూట్ అవుతారో వారినే శంకర్ ఎంచుకుంటుంటాడు. కాగా ఈ చిత్రంలోని ఓ కీలకపాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ఖుష్భును ఎంచుకున్నాడట. ఈమె పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని టాక్. ఖుష్భు చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఖష్భు చిరుకు అక్కగా నటించింది. మళ్లీ పదహారేళ్ళకు చిరు తనయుడు చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అయితే దీనిపై చిత్రబృందం నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రి, కొడుకుగా రెండు పాత్రల్లో నటించనున్నాడు. చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
నిజ జీవిత సంఘటనల ఆధారంగా మహేష్-రాజమౌళి సినిమా తెరకెక్కనుందా.. వామ్మో ఇదేం ట్విస్ట్?
‘లైగర్’ తర్వాత మార్పు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు నో చెప్పిన విజయ్..!
Allu Aravind | ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?