స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు లయ (Laya). చివరగా 2018లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది లయ. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్కు దూరమైంది. ఈ సీనియర్ నటి సినిమాలకు దూరమైనా తన ఫాలోవర్లకు ఆ లోటు రానీయకుండా చూసుకుంటుంది. ఎప్పటికపుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ హాయ్ చెప్తుంది.
ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ సాంగ్‌కు డ్యాన్స్ చేసి నెట్టింట్లో ఆ వీడియో పోస్ట్ చేయడం లయకు సరదా అని తెలిసిందే. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న లయ తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా లయ మరో పాటతో నెటిజన్ల ముందుకొచ్చింది. ఈ సారి మాత్రం కాస్త రూటు మార్చి ఫోక్ సాంగ్ ‘జాలే వోసినవేమయ్య ఓ జంగమయ్య’ను ఎంపిక చేసుకుంది. ఈ పాటను ఇప్పటికే పలువురు పాడగా.. పాపులర్ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన వెర్షన్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ వెర్షన్‌ను పాడిన మంగ్లీతో కలిసి లయ అదిరిపోయే డ్యాన్స్ చేసింది. చీరకట్టుల్లో లయ, మంగ్లీ కలిసి వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. లయ రీఎంట్రీకి సంబంధించి ఇప్పటికే వార్తలు రాగా.. ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
Read Also : Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో