ఇల్లెందు, సెప్టెంబర్ 06 : ఇల్లెందు పట్టణంలోని R & R కాలనీ 12వ వార్డు 6వ లైన్లో పరశురాం యూత్ కమిటీ గణనాథుడిని ఏర్పాటు చేసింది. శనివారం శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, ఇల్లెందు పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిలివేరి సత్యనారాయణ హాజరయ్యారు. యూత్ కమిటీ సభ్యులు లడ్డూ వేలం పాట నిర్వహించారు. అయితే ఈ వేలం పాటలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది.
వేలం పాటలో స్థానికులతో పాటు ముస్లిం కుటుంబం పాల్గొంది. అదే కాలనీకి చెందిన ఇమామ్ రూ.49,116 వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు. కుల మతాలకు అతీతంగా ఐక్యతను చాటిన ఇమామ్ ను కాలనీవాసులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో రాకేశ్ పాసి, శేఖర్, బన్సీ, సందీప్, అజయ్, కపిల్, బాలకిషన్, కళ్యాణ్, ఊర్మిళా భాయ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.