మునుగోడు, ఆగస్టు 25 : పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మునుగోడు తాసీల్దార్ నరేశ్‌కు మండల రేషన్ డీలర్ల సంఘం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ.. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయాలని కోరారు. మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం సరఫరా చేసినప్పటికీ కమీషన్ ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో డీలర్ల మండల అధ్యక్షుడు ఉడుత సైదులు, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి పూల శాలిని పాల్గొన్నారు.