నల్లగొండ రూరల్, ఆగస్టు 25 : బీసీ మండల్ (బింధ్యేశ్వరి ప్రసాద్ మండల్) 107వ జయంతి వేడుకలను నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగాళా ఎదుట గల బిపి మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీపీ మండల్ 40 సూత్రాలు ప్రవేశపెడితే 1990లో ఆనాడు ప్రధాని వీపీ సింగ్ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు.
మిగతా 39 సూత్రాల సాధనకు బీసీలు ఏకమై పోరాటం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేణి యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజ్, కర్నాటి మచ్చగిరి, కస్తూరి రవీందర్, భద్రయ్య పాల్గొన్నారు.