ఇల్లెందు, ఆగస్టు 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏడిఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, కామేపల్లి కృష్ణ ప్రసాద్, దేవి లాల్ మాట్లాడుతూ.. తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు కావస్తున్నా రైతులకు కనీసం యూరియా కూడా సకాలంలో సరఫరా చేయలేని దుస్థితిలో ఉందన్నారు. రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుని, రైతులకు నిజమైన ధరకు ఎరువులు అందజేసేలా చూడాలన్నారు. యూరియా కొరత కారణంగా ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యేక పరిహారం అందించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేస్తదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం రమేశ్, మండల కన్వీనర్ రేణుక, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఘాజి, ఉద్యమకారుడు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర బావ సింగ్, ఉద్యమ నాయకులు దేవిలాల్, డేరంగుల పోశం, రామ్ నాయక్, భూక్య హుస్సేన్, పరుచూరి వెంకటేశ్వర్లు, సిలువేరు సత్యనారాయణ, ఎర్రబెల్లి కృష్ణయ్య, రాంలాల్ పాసి, జెకె శ్రీను, మాజీ ఉప సర్పంచ్ కాంట నాగరాజు, మండల నాయకులు వడ్లురీ శ్రీకాంత్, బోడె రమేశ్, చిన్నారి, జాన్ బాబు, నందు, శ్రీను, మూలగుండ్ల ఉపేందర్ రావు, యాకయ్య, వెంకట్, బుర్ర సుభాశ్, గంట నారాయణ, వెంకన్న, అనసూయ, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబి, మాజీ కౌన్సిలర్ చీమల సుజాత, సన రాజేశ్, కిషన్ పాసి, యువజన నాయకులు లలిత్ ,ఇమ్రాన్, నారపాక వసంత్, పాలడుగు రాశేఖర్, కావేటి రమేశ్, రాచపల్లి శీను, తుంగ మహేశ్, సుందరగిరి శీను, పరికపల్లి రవి, బజారు సత్యనారాయణ, కమల్ పాసి, నందు పాసి, ఎస్ కే బాబా, ఎస్పీ బాబా, వంగ సునీల్, మునుగంటి శివ, భాను ప్రకాష్, శ్రీకాంత్, హరిప్రసాద్ యాదవ్, ఎస్ కే చాంద్, సత్తా హరికృష్ణ, ఎస్బి సర్దార్, కమల్, పాసి రామారావు, మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి, నెమలి ధనలక్ష్మి, భాగ్య, మౌనిక, మదర్ బి పాల్గొన్నారు.