చందంపేట, ఆగస్టు 25 : పెండిండ్లో ఉన్న డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు కు మండల రేషన్ డీలర్లు వినతి పత్రం అందజేశారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినప్పటికి ఇప్పటి వరకు కమీషన్ రాలేదని తెలిపారు. రేషన్ డీలర్లకు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, కృష్ణయ్య, పరమేశ్, రజిత, వెంకటయ్య, శంకర్ పాల్గొన్నారు.