హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. సోమవారం బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటే అందరికి ఆత్మీయత ఎక్కువ. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
సావాస దోషాలతో రేవంత్ రెడ్డి లైన్లో నడుస్తున్నారన్నారు. అప్పులపై స్పీకర్ అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రూ.3 లక్షల 50 వేల 520 కోట్లు అని పార్లమెంటులో కేంద్రమంత్రి అన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపి స్పీకర్ ప్రసాద్ కుమార్ సీఎం కావాలన్నారు.
పార్లమెంట్లో రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అప్పులపై సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం యాదయ్య, శ్రీకాంతాచారి ఆత్మబలిదానాలు చేసుకుంటే రేవంత్ మాత్రం చంద్రబాబు నాయుడు సంకలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నేను కుమార్‌ను ఓయూ వైస్ ఛాన్సలర్ ను చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఫ్యూడలిజం, భూస్వామ్య మనస్తత్వం బయటప డిందన్నారు. ఓయూలో కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు . జీవో 29 పేరు మీద రేవంత్ రెడ్డి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు.
కోర్టు తీర్పులను సీఎం అవమానిస్తున్నారు
కోర్టుల్లో ఉన్న అంశాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కోర్టులను, కోర్టు తీర్పులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు నిరుద్యోగులు బస్సులు వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగారు. 60వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గుర్తించిన ఉద్యోగాలా? సృష్టించిన ఉద్యోగాలా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో రేవంత్ రెడ్డి చంపింది ఏనుగులు, సింహాలను కాదు
జింకలు, నెమళ్లను చంపారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డికి భయం మొదలైంది.
ఉస్మానియా భూములను బీఆర్ఎస్ ప్లాట్లు చేసుకుని అమ్ముకుంటారని రేవంత్ రెడ్డి అంటున్నారు. గచ్చిబౌలి భూములను ప్లాట్లు చేసి అమ్ముకున్నది ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కోదండరాం పట్ల రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. రేవంత్ రెడ్డిని హీరోగా పెట్టి ఆహా నా పెళ్లంట సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. ఓయూకు వెయ్యి కోట్లు ఇవ్వాలన్నారు. కోదండరామ్ సీఎం పదవికి రేవంత్ రెడ్డి కంటే అర్హుడుఅన్నారు.
కోదండరామ్‌ను సీఎం చేయాలి
రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయి కోదండరామ్ కు సీఎం పదవి అప్పగించాలని సూచించారు. నేను రాజకీయాల్లోకి రియల్ ఎస్టేట్ దందాల కోసం రాలేదన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా
ప్రజల కోసం పనిచేశానని స్పష్టం చేశారు. మా కష్టానికి, త్యాగానికి విలువ లేదా? ఎరుకుల బిడ్డ కుర్రా సత్యనారాయణ కు ఎమ్మెల్సీ ఇస్తే అడ్డుకున్నారన్నారు.
మేము కోదండరామ్ ను అడ్డుకోలేదు. మా గొంతుకోయడం కోసం కోదండరామ్ ను రేవంత్ రెడ్డి అడ్డుపెట్టారన్నారు. కోదండరామ్ తో రేపు పొద్దున మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోదండరామ్ ను నిలబెట్టాలని సవాల్ విసిరారు. కోదండరామ్ ను లిటిగేషన్ లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సీఎం కుర్చీని గౌరవించాలని అంటున్న రేవంత్ రెడ్డి మంత్రి పదవిని, వైస్ ఛాన్సలర్ పదవిని
ఎందుకు గౌరవించడం లేదన్నారు.