మునుగోడు, ఆగస్టు 25 : రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏఓ పద్మజకు సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతాంగం యూరియా కోసం బారులు తీరుతున్న దృష్యాలే కనిపిస్తున్నాయన్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, రైతులు అంజయ్య, లింగయ్య పాల్గొన్నారు.
Munugode : యూరియా అందించాలని ఏఓ పద్మజకు సీపీఎం మునుగోడు వినతి