IPL 2025 : నిరుడు సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ 18వ ఎడిషన్‌లోనూ అదరగొట్టడం ఖాయం అనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. వైల్డ్ ఫైర్ ఆట తొలిమ్యాచ్కే పరిమితమైంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రికార్డు ఛేజింగ్ ఒక్కటే గొప్పగా చెప్పుకునేందుకు మిగిలింది. బ్యాటర్ల నిలకడలేమి.. బౌలింగ్‌లో పస లేకపోవడంతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన కమిన్స్ సేన మూడో విజయం కోసం నిరీక్షిస్తోంది.
ఇప్పటివరకూ సొంతగడ్డపై మాత్రమే గెలుపొందిన ఆరెంజ్ ఆర్మీ బుధవారం ఉప్పల్ మైదానంలో బలమైన ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో తలపడుతోంది. వాంఖడేలో షాక్ తిన్న హైదరాబాద్ ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. అది జరగాలంటే టాపార్డర్ మరోసారి చెలరేగాలి. అయితే.. దూకుడే మంత్రగా కాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడడమూ ముఖ్యమే. లేదంటే సన్‌రైజర్స్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
📍 Hyderabad @SunRisers 🆚 @mipaltan
Who are you backing tonight? 🤔 #TATAIPL | #SRHvMI pic.twitter.com/m9Y2DIkj1J
— IndianPremierLeague (@IPL) April 23, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన ముంబైని ఓడించాలంటే సన్‌రైజర్స్ ఆటగాళ్లు శ్రమించాల్సిందే. టాపార్డర్ బ్యాటర్లు దంచికొడితే తప్ప అది సాధ్యం కాదు. అవును.. ఏప్రిల్ 12న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ (141) వీరోచిత సెంచరీతో కదం తొక్కగా.. ట్రావిస్ హెడ్(66) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
1️⃣7️⃣1️⃣ shades of DESTRUCTION 💥
A record partnership from Travis Head & Abhishek Sharma sealed a dominating win for #SRH 🧡
Scorecard ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/2Xglq22Mrf
— IndianPremierLeague (@IPL) April 12, 2025
ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్(21), ఇషాన్ కిషన్(9)లు నాటౌట్‌గా నిలిచి లాంఛనం ముగించారు. అయితే.. ముంబైతో మ్యాచ్‌లో అభిషేక్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో 162 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని హార్దిక్ పాండ్యా బృందం 18.1 ఓవర్లలోనే ఛేదించింది.
ఉప్పల్‌లో సన్‌రైజర్స్ టాపార్డర్‌కు, ముంబై పేస్ త్రయానికి మధ్య తగ్గ పోరు జరుగనుంది. ఫామ్‌లో ఉన్న అభిషేక్, హెడ్లను నిలువరిస్తే తప్ప ముంబైకి గెలుపు అవకాశాలు ఉండవు. అయితే.. మిడిలార్డర్లో క్లాసెన్, నితీశ్ ధనాధన్ ఆడడం కూడా కీలకం. అలవోకగా పెద్ద షాట్లు ఆడగల అనికేత్ వర్మ(Aniket Varma)ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపితే ఇంకా మంచిది. అయితే.. బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్‌ల రూపంలో ముప్పు పొంచి ఉంది. వీళ్లను దీటుగా ఎదుర్కొంటేనే మరోసారి భారీ స్కోర్ చేయడం సాధ్యమవుతుంది.
Every chant. Every clap. Every heartbeat. 👏
Let’s make Uppal the loudest tonight, #OrangeArmy 🗣 🧡#PlayWithFire | #SRHvMI | #TATAIPL2025 pic.twitter.com/zP8OaiA8VF
— SunRisers Hyderabad (@SunRisers) April 23, 2025
ఇప్పటివరకూ ఇరుజట్లు 24 సార్లు ఎదురుపడ్డాయి. ముంబై అత్యధికంగా 14 పర్యాయాలు గెలుపొందగా.. సన్‌రైజర్స్ 10 విజయాలతో పర్వాలేదనిపించింది. అయితే.. ఈసారి 4 విక్టరీలతో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ముంబైకి చెక్ పెడితేనే కమిన్స్ సేన ముందడుగు వేయగలదు. అందుకే.. ఈ మ్యాచ్‌ను ఆరెంజ్ ఆర్మీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. పహల్గమ్ ఉగ్రదాడి(Pahalgam Attack) బాధితులకు సంతాపంగా ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు, అంపైర్లు.. భుజానికి నల్ల రిబ్బన్లు కట్టుకోనున్నారు.