వెల్దండ : బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండలో జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై క్రూరమైన దాడికి పాల్పడిన ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెల్దండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉగ్రవాదుల దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ గౌడ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిని గుర్తించి ఉరిశిక్షి విధించాలని డిమాండ్ చేశారు. భారతదేశం నుంచి ఉగ్ర మూకలను తరిమి కొట్టాలన్నారు. ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తిండి తింటూ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ గౌడ్, నాయకులు ప్రశాంత్ నందు గౌడ్, నాగరాజు, శివ, సతీష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.