కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : ఓ స్థలం విషయంలో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంగా మారింది. ఆ స్థలం విషయంలో ఇరువర్గాల భిన్నాభిప్రాయాలపై కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఆ స్థలంలో ఓ వర్గానికి చెందిన కొంతమంది రాత్రికి రాత్రి అక్రమంగా షెడ్డు నిర్మాణ పనులకు పూనుకున్నారు. మరో వర్గానికి చెందిన బాధితుడు రాజ్ కుమార్ అక్రమ షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ నరసింహకు ఇవాళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా బాధితులు విలేకరులతో మాట్లాడుతూ.. జీడిమెట్ల డివిజన్ పైప్ లైన్ రోడ్డు మార్గంలో మయూరి బార్ వెనకాల సర్వే నెంబర్ 16లో గత కొన్నేళ్ల కిందట సుమారు 13 వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. అయితే జీడిమెట్ల ప్రాంతానికి చెందిన కొంతమంది భూఆక్రమణదారులు తప్పుడు పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం కోర్టులో వివాదంగా మారిందని, అయితే ఇటీవల భూ కబ్జాదారులు తన స్థలంలో అక్రమ షెడ్డు నిర్మాణం చేపడుతున్నారన్నారు.
దీనిపై పోలీసులకు, అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడంలేదని బాధితులు వాపోయారు.
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపడితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నించారు. ఇదే విషయంపై టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారిని వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నాడని.. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అక్రమంగా చేపడుతున్న షెడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి