Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో నగర ప్రజలు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఉద్యోగాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈస్ట్, నార్త్ హైదరాబాద్ ఏరియాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఓయూ క్యాంపస్, రాంనగర్, తార్నాక, అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కోఠి, నారాయణగూడ, లక్డీకాపూల్, సచివాలయం, ఖైరతాబాద్, బంజారాహిల్స్, నానక్రామ్గూడ, ఖాజాగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, కాచిగూడ, నల్లకుంట, బర్కత్పురా, మెహిదీపట్నం, షేక్పేటతో పాటు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.