Ravali | ఎలా ఉండే రవళి ఎలా మారింది.. అస్సలు గుర్తు పట్టలేనట్టుగా ఉందిగా..!
Ravali | తెలుగు సినీప్రియులకు రవళి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆమె అందం, సహజ నటన, ఆకట్టుకునే చిరునవ్వు. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు తెరపై మెరిసిన ఈ నటి స్టార్ హీరోలతో కలసి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది.
Ravali | తెలుగు సినీప్రియులకు రవళి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆమె అందం, సహజ నటన, ఆకట్టుకునే చిరునవ్వు. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు తెరపై మెరిసిన ఈ నటి స్టార్ హీరోలతో కలసి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. 1990లో మలయాళ సినిమా ‘జడ్జిమెంట్’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన రవళి, తదుపరి ఏడాది ‘జయభేరి’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా, ‘పెళ్లి సందడి’ సినిమాతో రవళి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ‘ఒరేయ్ రిక్షా’, ‘వినోదం’, ‘చిన్నబ్బాయి’, ‘ముద్దుల మొగుడు’, ‘శుభాకాంక్షలు’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
తర్వాత కాలక్రమేణా ప్రధాన పాత్రల అవకాశాలు తగ్గడంతో రవళి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు చిత్రాల్లో నటించింది. 2007లో ఆమె నీలికృష్ణను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవళి సోదరి హరిత కూడా నటి కావడం విశేషం; ఆమె అనేక తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించింది. తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు, మలయాళంలో మోహన్‌లాల్‌తో కూడా రవళి నటించింది. చివరిసారిగా 2011లో ‘మాయగాడు’ చిత్రంలో కనిపించిన ఆమె, ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం కుటుంబ జీవితంలో మమేకమై సంతోషంగా గడుపుతోంది. ఇటీవల రవళి, హీరోయిన్ రోజాతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని మీడియాలో మళ్లీ దర్శనమిచ్చింది.
రీసెంట్గా రవళి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వాటిని చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఎంత అందంగా ఉండే రవళి ఇలా మారిపోయిందేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. స్వతహాగా తెలుగమ్మాయి అయిన రవళి, కేవలం 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 20 ఏళ్లు ప్రేక్షకులను అలరించింది. ఆమె అందం, అభినయం, సౌమ్యమైన వ్యక్తిత్వం ఈరోజు కూడా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

