బోస్టన్: చికాగో నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో ఇద్దరు మైనర్లపై ఫోర్క్‌తో దాడి చేసిన కేసులో భారతీయ వ్యక్తి ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్(Praneeth Kumar Usiripalli)ను కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికా కోర్టు పరిధిలో అతనికి శిక్షను ఖరారు చేయనున్నారు. అక్టోబర్ 25వ తేదీన ప్రణీత్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. బోస్టన్లోని ఫెడరల్ కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో జరిగిన ఘటన నేపథ్యంలో అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ 17 ఏళ్ల కుర్రాడిని భుజం భాగంపై, మరో 17 ఏళ్ల పిల్లాడిని తల వెనుక భాగంలో ఫోర్క్‌తో అటాక్ చేశాడు. దాడి ఘటనతో ఏర్పడిన గందరగోళంలో.. విమానాన్ని బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు తరలించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రణీత్ కుమార్ అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉంటున్నాడు. ప్రస్తుతం మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ కేసులో ప్రణీత్‌కు 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించనున్నారు.
🚨#FBI Boston has charged Praneeth Kumar Usiripalli, an Indian national, with allegedly stabbing two minor victims with a metal fork while on board a Lufthansa flight from Chicago to Germany. Learn more: https://t.co/PRVulpkuaQ pic.twitter.com/VDkyAqM0x1
— FBI Boston (@FBIBoston) October 28, 2025