న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గింపు ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.
స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జాతోపాటు ఫ్రాంక్స్ మాడల్ గరిష్ఠంగా 8.5 శాతం వరకు తగ్గించినట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన విక్టోరిస్ మాడల్ ధరను కూడా జీఎస్టీ రేట్లకు అనుగుణంగా మార్చింది.