న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సబ్బులు, షాంపో, టూత్‌పెస్ట్, షేవ్ లోషన్స్ మరింత చౌక కానున్నాయి. తగ్గించిన ధరలు వచ్చే సోమవారం నుంచి అమలులోకి రానున్నట్టు ఆయా కంపెనీలు ప్రకటించాయి.
వీటిలో పీఅండ్‌జీ, హెచ్‌యూఎల్‌లు ఏకంగా తమ పాత ఉత్పత్తులపై కొత్త ధరలను ముద్రించాయి కూడా. తగ్గించిన ఉత్పత్తుల్లో విక్స్, హెడ్ అండ్ షౌల్డర్, ప్యాంటినా, జిల్లెట్, ఓరల్-బీ ఉత్పత్తులపై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.