ముంబై, సెప్టెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో మదుపరుల్లో జోష్నింపంది. ఫలితంగా ప్రారంభం నుంచి లాభాలబాట పట్టిన సూచీలుచివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 83 వేల కీలక మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 320.25 పాయింట్లు అందుకొని 83,013.96కి చేరుకోగా, మరో సూచీ నిఫ్టీ 93.35 పాయింట్లు ఎగబాకి 25,423.60 వద్ద ముగిసింది. ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ కంపెనీల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వరుసగా లాభాల బాటపడుతున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. జోమాటో పేరుతో సేవలు అందిస్తున్న ఎటర్నల్ షేరు 2.96 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది.
దీంతోపాటు సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఒక్క శాతానికి పైగా లాభపడగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీ, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటర్స్ షేరు 1.13 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. అలాగే ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తూ ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ ఏడాది మరోరెండు సార్లు రేట్లను తగ్గించే అవకాశాలున్నట్టు సంకేతాలు ఇవ్వడం సూచీల్లో జోష్ పెంచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా హెల్త్‌కేర్, ఐటీ, ఐటీ, టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మెటల్ రంగ షేర్లు లాభపడగా..క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, ఎనర్జీ, కమోడిటీస్ రంగ షేర్లు నష్టపోయాయి.