దేశంలోకి త్వరలో కొత్తగా ఎనిమిది బ్యాంకులు
కొత్తగా ఎనిమిది బ్యాంకులు |

న్యూఢిల్లీ : దేశంలో మరికొన్ని కొత్త బ్యాంకులు ఉనికిలోకి రానున్నాయి. పెద్ద, చిన్న బ్యాంకులు త్వరలో తెరుచుకోబుతున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా వెల్లడించింది. పెద్ద, చిన్న బ్యాంకుల కోసం ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని గురువారం తెలిపింది. యూనివర్సల్ బ్యాకింగ్ లైసెన్స్ కోసం యూఏఈ ఎక్స్ఛేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిపాట్రియేట్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ (రెప్కో బ్యాంక్), చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, పంకజ్ వైశ్య దరఖాస్తులు చేశాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) కోసం విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వార క్షత్రియ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.
ఐదుగురు సభ్యులతో కమిటీ..
బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తులను సమీక్షించేందుకు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ రేవతి అయ్యర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బి మహాపాత్ర, కెనరా బ్యాంక్ మాజీ చైర్మన్ టీఎన్ మనోహరన్, పెన్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ హేమంత్ ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో ఐడీఎఫ్సీ లిమిటెడ్, బంధన్ ఫైనాన్షియల్ బ్యాంక్‌తో సహా రెండు బ్యాంకులకు ఆమోదం తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 మార్గదర్శకాల ప్రకారం.. పెద్ద బ్యాంకు తెరిచేందుకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పదేళ్ల అనువభవం ఉండాలి. అయితే, పెద్ద ఇండస్ట్రియల్ హౌస్‌లకు మినహాయింపును ఇచ్చారు. పెద్ద, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం దరఖాస్తులు ప్రాథమికంగా ప్రైమా సౌకర్యాన్ని నిర్ధారించడానికి సిద్ధం చేయబడతాయి. స్టాండింగ్ ఎక్స్ టర్నల్ అడ్వైజరీ కమిటీ (ఎస్ఏఐసీ) దరఖాస్తులను మదింపు చేస్తుంది. ఎస్ఏఐసీ పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. పాత రికార్డులు స్పష్టంగా ఉంటేనే బ్యాంకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

