Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Iron Rod Pierces Boy's Mouth | ఒక బాలుడు ఇంటి బయట ఆడుతూ కిందపడ్డాడు. అక్కడ ఉన్న ఒక ఇనుప కడ్డీ ఆ బాలుడి నోటిలోకి చొచ్చుకెళ్లింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడ్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ డెంటల్ డాక్టర్ సహాయంతో వైద్యులు సర్జరీ చేసి ఐరాన్ రాడ్ ముక్కను బయటకు తీశారు.
గాంధీనగర్: ఒక బాలుడు ఇంటి బయట ఆడుతూ కిందపడ్డాడు. అక్కడ ఉన్న ఒక ఇనుప కడ్డీ ఆ బాలుడి నోటిలోకి చొచ్చుకెళ్లింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడ్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ డెంటల్ డాక్టర్ సహాయంతో వైద్యులు సర్జరీ చేసి ఐరాన్ రాడ్ ముక్కను బయటకు తీశారు. ఆ బాలుడి ప్రాణాలు కాపాడారు. (Iron Rod Pierces Boy’s Mouth) గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వేద్ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ అదుపుతప్పి నేలపై పడ్డాడు. అక్కడ ఉన్న ఒక సన్న ఇనుప కడ్డీ అతడి నోటిలోకి బలంగా గుచ్చుకున్నది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.
కాగా, ఇది చూసిన బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తరలించారు. వైద్యులు ఆ బాలుడిని పరీక్షించారు. దంతాలు, దవడ భాగంలో లోతుగా ఆ ఇనుప కడ్డీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. చాలా సున్నిత భాగంలో అది చిక్కుకోవడంతో దానిని తొలగించడానికి ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సహాయం కోసం ఒక ప్రైవేట్ డెంటల్ సర్జన్‌ను కూడా పిలిపించారు.
మరోవైపు ఈ వైద్య బృందం సుమారు గంటరన్నర పాటు క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించింది. బాలుడి దవడ, చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి నష్టం జరుగకుండా వైద్యులు జాగ్రత్తగా ఆ ఇనుప ముక్కను తొలగించి అతడి ప్రాణాలు కాపాడారు. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు బహిరంగ ప్రదేశాలలో ఆడుకునే పిల్లలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని డాక్టర్లు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

