Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy | మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లాలోని పెద్దగూడెం తండాలో కరెంట్ కోతలతో ఎండిపోయిన వరి పంటలను బీఆర్ఎస్ శ్రేణులుతో కలసి పరిశీలించారు.
మహబూబ్ నగర్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) జిల్లాలోని పెద్దగూడెం తండాలో కరెంట్ కోతలతో ఎండిపోయిన వరి పంటలను బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులుతో కలసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.ఇది నిజమైన కరువు ( Drought ) కాదని, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ నినో పేరుతో కాలం వెలిబుచ్చుతున్నారని విమర్శింఆచరు. పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష నిర్వహించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా రెండున్నర కోట్ల మంది రైతులు ఆధారపడి ఉన్నార, ని వారంతా ప్రభుత్వంపై తిరగబడే అనివార్యత ప్రభుత్వమే కల్పించిం దని పేర్కొన్నారు. రైతులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని, ప్రభుత్వంతో పోరాడి నష్టపరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటామని బహిరంగం చెబుతున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని విమర్శించారు.రేవంత్ రెడ్డికి కరెంట్ సరఫరాపై అవగాహన, సోయి లేదని అన్నారు. నేటికి శ్రీశైలం ప్రాజెక్టులో 70 టీఎంసీల నీటి లభ్యత ఉందని, నీటి లభ్యత ఉన్నా పాలమూరు, కల్వకుర్తి పంపులు నడుపతలేరని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో ఘోరమైన వైఫల్యం చెందిందిని వెల్లడించారు.
ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్ , నందిమల్ల అశోక్, కె.మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, ధర్మా నాయక్, మాధవ్ రెడ్డి, సునీల్ వాల్మీకి, శంకర్ నాయక్, చిట్యాల రాము, నారాయణ నాయక్, టీక్యా నాయక్, గోవిందు నాయక్, అలీం పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

