Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకం లభించింది. మెన్స్ టీ47 లాంగ్ జంప్ ఈవెంట్లో నిషాద్ కుమార్ గోల్డ్ మెడల్ గెలిచాడు. రెండు సార్లు పారాఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన నిషాద్.. ఏషియన్ గేమ్స్‌లో 7.11 మీటర్ల బెస్ట్ జంప్‌తో తన సత్తా చాటాడు.
నగోయా: ఏషియన్ పారా గేమ్స్‌లో భారత్‌కు మొదటి రోజే రెండు స్వర్ణం లభించింది. మెన్స్ టీ47 లాంగ్ జంప్ ఈవెంట్లో నిషాద్ కుమార్(Nishad Kumar) గోల్డ్ మెడల్ గెలిచాడు. రెండు సార్లు పారాఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన నిషాద్.. ఏషియన్ గేమ్స్‌లో తన సత్తా చాటాడు. లాంగ్ జంప్ ఈవెంట్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అతని బెస్ట్ జంప్ 7.11 మీటర్లుగా ఉంది. ఫైనల్స్‌లో అతను రెండు సార్లు ఆ మార్క్ అందుకున్నాడు. తొలి జంప్‌లో నిషాద్ 6.95 మీటర్ల దూకాడు. ఆ తర్వాత సెకండ్ అటెంప్ట్‌లో 7.08మీటర్లకు చేరుకున్నాడు. ఇక మూడవ రౌండ్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తూ 7.11 మీటర్ల మేర దూకాడు. ఇక నాలుగవ ప్రయత్నంలో అతను ఫౌల్ అయ్యాడు. చివరి రెండు జంప్స్లో అతను మళ్లీ పుంజుకున్నాడు. అయిదో జంప్‌లో 7.11 మీటర్లు, ఆరో జంప్‌లో 7.07 మీటర్ల దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒమాద్బేక్ ఖాసనోవ్కు సిల్వర్, శ్రీలంక స్టార్ సఫ్రాన్‌కు బ్రాంజ్ మెడల్స్ దక్కాయి.
జూడో ఈవెంట్లో ఇండియాకు సిల్వర్ మెడల్ దక్కింది. మహిళల ఈవెంట్లో వరల్డ్ నెంబర్ వన్ ఐబైక్ కిజీ ఫైనల్లో సత్తా చాటింది. దీంతో భారత అథ్లెట్ కోకిలకు రజత పతక్కం దక్కింది. ఏషియన్ పారా గేమ్స్‌లో వరుసగా రెండోసారి కోకిల మెడల్ గెలుచుకున్నది. 2022లో హాంగ్జూ క్రీడల్లో ఆమె ఇదే ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

