MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
MP Helen Haines: ఆస్ట్రేలియా ఎంపీ హెలన్ హెయిన్స్ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను దాడిగా వర్ణించారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్. మెల్బోర్న్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాన్గరట్టాలోని ఆమె ఆఫీసు ముందే ఈ ఘటన జరిగింది.
క్యాన్బెరా: ఆస్ట్రేలియా ఎంపీ హెలన్ హెయిన్స్(MP Helen Haines)ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను దాడిగా వర్ణించారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్. మెల్బోర్న్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాన్గరట్టాలోని ఆమె ఆఫీసు ముందే ఈ ఘటన జరిగింది. 65 ఏళ్ల హెలన్కు తీవ్రంగా గాయాలు అయినట్లు విక్టోరియా తాత్కాలిక పోలీసు చీఫ్ ఆష్లే మాసన్ తెలిపారు. కారు దాడి ఘటనలో 43 ఏళ్ల డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో ఓ కత్తిని కూడా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇదేమీ యాక్సిడెంట్ కాదు అని, కావాలనే ఈ దాడికి ప్రయత్నించారని ప్రధాని ఆల్బనీస్ పేర్కొన్నారు. ఎంపీ హెలన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే దాడి చేసిన వ్యక్తి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఇంకా తెలియదు. ఇటీవల ఆస్ట్రేలియాలో రాజకీయవేత్తలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. చట్టసభ ప్రతినిధులను బెదిరిస్తున్న గ్రూపులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

