Mahavatar Narsimha | హిందూ పురాణాల నేపథ్యంలో యానిమేటెడ్ సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha). కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లైన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ప్రపంచవ్యాప్తంగా జూలై 25న థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 19 నుంచి పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనూ తన దూకుడు ప్రదర్శిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ముందుగా అంతా ఊహించినట్టుగానే అద్బుతమైన వ్యూయర్షిప్తో డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా దండయాత్ర కొనసాగిస్తోంది. అశ్విన్ కుమార్ స్టోరీ టెల్లింగ్, సాలిడ్ విజువల్స్‌కు కుటుంబ ప్రేక్షకులు, చిన్నారులు ఫిదా అయిపోతున్నారు.
హిందూ పురాణాలలోని శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఫస్ట్ పార్టుగా వచ్చింది మహావతార్ నరసింహ. ఈ ప్రాంచైజీలో రాబోయే నెక్ట్స్ పార్టులపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
The latest update reveals that #MahavatarNarsimha is trending at the top position on Netflix India.
The movie is leaving family audiences and kids spellbound with its storytelling and solid visuals.
The expectations are now massive for the upcoming films in the franchise. pic.twitter.com/CIJRq0PgTr
— Cinema Mania (@ursniresh) September 22, 2025
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
Venky 77 | వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫన్ రైడ్.. వెంకీ 77 సెట్స్‌పైకి వెళ్లే టైం ఫిక్స్..!