Encounter | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులుగా సమాచారం. అలాగే, ఏకే47లతో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనంచేసుకున్నారు. ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులోని అజూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు అధికారులు తెలిపారు.
ఉదయం నుంచి కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నారు. మావోయిస్టుల సంచారంపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు ఇద్దరు మావోల మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, ప్రచార సామగ్రి, రోజువారీ ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసాగా గుర్తించినట్లు సమాచారం.