Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న కాంతార చాప్టర్ 1 (ప్రీక్వెల్) మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రిషబ్ శెట్టి టీం. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న (సోమవారం) లాంచ్ చేయనున్నారని తెలిసిందే.
Kantara Chapter 1 | శాండల్‌వుడ్ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు రిషబ్ శెట్టి (Rishab Shetty). కాంతార సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రిషబ్ శెట్టి ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో కాంతార చాప్టర్ 1 (ప్రీక్వెల్)లో నటిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రిషబ్ శెట్టి టీం. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న (సోమవారం) లాంచ్ చేయనున్నారని తెలిసిందే.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1 ట్రైలర్‌ను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఆయా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు లాంచ్ చేయనున్నారు. తెలుగులో గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ఒకటి షేర్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలతో క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది.
ఇక తమిళ ట్రైలర్‌ను కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్, హిందీ ట్రైలర్‌ను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లాంచ్ చేయనున్నారు. మలయాళ ట్రైలర్‌ను మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ లాంచ్ చేయనున్నాడు. కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. రిషబ్ శెట్టి మరోవైపు జై హనుమాన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
When the roar of a Legend unites with the power of a Rebel Star 🔥
The Telugu Trailer of #KantaraChapter1 will be launched by the iconic Rebel Star #Prabhas.More legends. More languages.
One roar echoes across the world. Stay tuned!#KantaraChapter1Trailer on September 22nd… pic.twitter.com/ln73waQBnk
— Hombale Films (@hombalefilms) September 20, 2025
Read Also :
Itlu Me Yedhava | ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

