Itlu Me Yedhava | ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సానా
దర్శకుడు త్రినాథ్ కఠారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సంజీవని ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'ఇట్లు మీ ఎదవ'. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సానా విడుదల చేశారు.
Itlu Me Yedhava | దర్శకుడు త్రినాథ్ కఠారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సంజీవని ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా విజయంవంతం అవ్వాలని చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సానా మాట్లాడుతూ “ఈ గ్లింప్స్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఫన్నీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి జీవితంలో సెటిల్ అయ్యే వరకు ప్రతి అబ్బాయిని ఎవరైనా ఏదో ఒక సందర్భంలో ‘ఎదవ’ అని పిలుస్తూనే ఉంటారు. ఈ టైటిల్ చాలా కొత్తగా, యూత్‌ఫుల్‌గా ఉంది. త్రినాథ్ కఠారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రం తప్పకుండా యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘ఇట్లు మీ ఎదవ’ చిత్ర యూనిట్‌కి నా తరపున ఆల్ ది బెస్ట్” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బళ్లారి శంకర్, హీరోయిన్ సాహితీ అవాంచ, నటులు తనికెళ్ళ భరణి, గోపరాజు రమణతో పాటు చిత్ర బృందం పాల్గొంది.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, హీరోగా త్రినాథ్ కఠారి వ్యవహరిస్తున్నారు. మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు. ఇటీవల నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు పొందిన జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా, ఉద్ధవ్ ఎస్.బి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాంకేతిక బృందం:
– రచన, దర్శకత్వం: త్రినాథ్ కఠారి
– నిర్మాత: బళ్లారి శంకర్
– బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్
– సంగీతం: ఆర్.పి. పట్నాయక్
– డీవోపీ: జగదీష్ చీకటి
– ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి.
– ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్
– లైన్ ప్రొడ్యూసర్: బృందావన్ కేతిరెడ్డి
– కాస్ట్యూమ్ డిజైనర్: బృందావర్ధని అవ్వారు
– పీఆర్వో: తేజస్వి సజ్జా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

