Tamannaah Bhatia | తెలుగు, హిందీతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ అందుకున్న ఈ భామ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ పాపులర్ నటీమణుల్లో టాప్‌లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచుతూ.. కొత్త హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది.
నెట్టింట సూపర్ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ తన బరువుకు సంబంధించి ట్రోల్స్ బారిన పడింది. అయితే ఆ ట్రోల్స్‌కు ఏమాత్రం స్పందించకుండా సైలెన్స్‌ను మెయింటైన్ చేస్తూ వస్తోంది తమన్నా. కానీ తనపై వస్తున్న ట్రోల్స్‌ను మనసులో పెట్టుకొని క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేయడమే కాకుండా కఠినమైన ఫిట్నెస్ మంత్రను ఫాలో అవుతూ మళ్లీ మునుపటి లుక్‌లోకి మారిపోయింది.
ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. తాను మరింత సన్నగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది. మరింత నాజూకుగా, స్లిమ్‌గా తయారై రాబోయే సినిమాల్లో అభిమానులను సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు చెప్పింది. మొత్తానికి మిల్కీ బ్యూటీ మళ్లీ పాత రోజులను గుర్తు తెచ్చేలా సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతుందని తాజా కామెంట్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
తమన్నా చివరగా ప్రైమ్ వీడియో సిరీస్ Do You Wanna Partnerతో ప్రేక్షకులను పలుకరించింది. తమన్నా ట్రాన్స్ఫార్మేషన్ ఇప్పటికే సూపర్ క్రియేట్ చేస్తుండగా.. సిల్వర్ స్క్రీన్‌పై తమన్నా కొత్త లుక్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Gopal Varma | ‘రంగీలా’ కాంబో.. ఆమిర్ ఖాన్ని కలిసిన రామ్ గోపాల్ వర్మ.!
OG Advance Bookings | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అలర్ట్.. ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్
Itlu Me Yedhava | ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సానా