Ram Gopal Varma meets Aamir Khan | బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ని టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలుసుకున్నాడు. ఈ సందర్భంగా నా రంగీలా మ్యాన్‌కి కలుసుకున్నాను అంటూ ఆర్జీవీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. వీరిద్దరి కాంబోలో రంగీలా అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 1995లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా ఆల్ టైం క్లాసిక్‌లలో ఒక్కటిగా నిలిచింది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఊర్మిళ మాతోండ్కర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ఏ.ఆర్. రెహమాన్ బాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి ఆయన అందించిన పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఈ సినిమా విడుదలై సెప్టెంబర్ 08 నాటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలోనే 4కే వెర్షన్లో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
Me with my RANGEELA man 💐💐💐 pic.twitter.com/oJsrT4l2XK
— Ram Gopal Varma (@RGVzoomin) September 20, 2025