They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో శ్రియారెడ్డి వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తుండగా.. డైరెక్టర్ సుజిత్ ఈ భామ కోసం ఎలాంటి పాత్రను రెడీ చేశాడోనని ఇప్పటికే మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు.
అభిమానుల క్యూరియాసిటీకి తెరదించుతూ శ్రియా రెడ్డి రోల్‌పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా ఓజీ నుంచి శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఓజీలో ఈ బ్యూటీ గీత పాత్రలో కనిపించనుండగా.. చీరకట్టులో ఉన్న శ్రియారెడ్డి కోపంతో తుపాకి ఎక్కుపెట్టడం చూడొచ్చు. ఇంతకీ గీత తుపాకి ఎవరిపైకి ఎక్కుపెట్టిందనేది సస్పెన్స్ నెలకొంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరో 5 రోజుల దాకా వెయిట్ చేయాల్సిందే.
ఓజీతో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఇటీవలే ఓజీ నుంచి అర్జున్ దాస్ క్యారెక్టర్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. బాక్సింగ్ ప్రిపరేషన్లో ఉన్న అర్జున్ దాస్ ఇంటెన్స్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Geetha has arrived 🔥#OG #TheyCallHimOG @sriyareddy pic.twitter.com/0jvGoeITlX
— DVV Entertainment (@DVVMovies) September 20, 2025
Ram Gopal Varma | ‘రంగీలా’ కాంబో.. ఆమిర్ ఖాన్ని కలిసిన రామ్ గోపాల్ వర్మ.!
OG Advance Bookings | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అలర్ట్.. ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్
Itlu Me Yedhava | ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సానా