Raj Kamal : తూర్పు ఆఫ్రికా (East affrica) దేశమైన ఎరిత్రియా (Eritria) లో భారత రాయబారి (Indian Ambassador) గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి (IFS officer) గా రాజ్ కమల్ (Raj Kamal) నియమితులయ్యారు. రాజ్ కమల్‌ను ఎరిత్రియాలో భారత రాయబారిగా నియమించినట్లు భారత విదేశాంగ శాఖ (External Affairs Ministry of India) వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటన చేసింది.
రాజకమల్ ప్రస్తుతం ఇటలీ మిలాన్ నగరంలోగల భారత రాయబార కార్యాలయంలో దౌత్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.