OG Trailer | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిన్న (సెప్టెంబర్ 21) జరిగిన ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానులకు మరచిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించిన పూర్తి వర్క్ కాకపోవడం వలన పోస్ట్ చేయాలని అనుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ సూచన మేరకు అప్పటి వరకూ రెడీ అయిన ట్రైలర్‌ను అక్కడే విడుదల చేయడం జరిగింది. ఇక కొద్ది సేపటి క్రితం ఫైనల్ వెర్షన్ OG థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇది విడుదలవ్వగానే… సోషల్ మీడియాను, సినిమా వర్గాలను పూర్తిగా షేక్ చేస్తోంది. దర్శకుడు సుజీత్ ఫుల్ మేకోవర్, తమన్ అదిరే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, విలన్ లుక్స్ ఈ ట్రైలర్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లాయి.
ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతారం, స్టైల్ , తమన్ మ్యూజిక్ , రిచ్ విజువల్స్ , క్లాస్ టు మాస్ పాకేజింగ్, చివర్లో పవన్ చెప్పిన “నా కొడకల్లారా..!” పంచ్ డైలాగ్ పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ డైలాగ్ విన్నవెంటనే అభిమానుల్లో గూస్బంప్స్ పుట్టించడంతో పాటు, ట్రైలర్‌కు ఊహించని రేంజ్లో బజ్ తీసుకొచ్చింది. గతంలో “లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప” లాంటి డైలాగ్ ఎంత హైప్ తీసుకువచ్చిందో, ఇదీ అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఈ స్థాయి మాస్ యాంగిల్ రావడం అభిమానుల్లో సంబరాలు తెచ్చిపెట్టింది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన అభిమానుల కోసం, OG చిత్రాన్ని పట్టుదలగా తీసుకొని పూర్తి చేశాడు. సినిమా పై ఆయన ఉన్న డెడికేషన్ ట్రైలర్‌తో తెలిసిపోతుంది.
ప్రస్తుతం OG ట్రైలర్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ OG ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలామంది ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు ఒకే మాట అంటున్నారు ..“ఇది తొలిరోజే ₹100 కోట్లు రాబట్టే సినిమా!” అని కామెంట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న, విజయదశమి కానుకగా OG గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ ఉండడం సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విషయమే. “గెట్ రెడీ… పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో తెరపై మాస్ తుఫాన్‌ను ఎవరూ ఆపలేరు అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.