హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీతాగోపీనాథ్ను విమర్శిస్తే, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని అవమానించినట్టేనని మాజీ మంత్రి తెలిపారు. మాగంటి సునీతాగోపీనాథ్ కంటతడిపై మంత్రులు పొన్నం, తుమ్మల అమానవీయం గా మాట్లాడటంపై ఆమె మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. భర్త చనిపోయిన మ హిళలపై సమాజంలో సానుభూతి ఉంటుందని, తన భర్త మరణా న్ని తట్టుకోలేక దుఃఖం వెలిబుచ్చిన ఆ మహిళ ను విమర్శిస్తున్న మంత్రుల తీరు ఆక్షేపనీయమని పేర్కొన్నా రు.
మహిళాలోకం ఆ మంత్రులను క్షమించబోదని హెచ్చరించారు. వారి వ్యాఖ్యలు సునీతమ్మనే కాదు, సోనియమ్మనూ విమర్శించినట్టే అవుతుందని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సమాజానికి మంత్రులుగా తమరు ఇచ్చే సందేశం ఇదేనా? అని ని లదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలువలేకపోతున్నామనే భయాందోళన ఆ మంత్రు ల మాటల ద్వారానే స్పష్టమైందని తెలిపారు. మహిళాలోకానికి ఆ ఇద్దరు మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.