విరూపాక్ష, సార్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ మందారం సంయుక్త మీనన్ త్వరలో ‘బ్లాక్ గోల్డ్’గా తెరపైకి రానున్నది. ‘చింతకాయల రవి’ చిత్రంతో దర్శకునిగా పరిచయమైన యోగి చాలా విరామం తర్వాత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమాకు ముందు భైరవి, రాక్షసి అనే పేర్లు పరిశీలించారు.
వాటికంటే ‘బ్లాక్ గోల్డ్’ అయితే.. జనంలోకి తేలిగ్గా వెళ్తుందన్న ఆలోచనతో దీన్ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమా దాదాపుగా సగంపై పూర్తయింది. ఓ గ్లింప్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఆ గ్లింప్స్తోపాటే టైటిల్ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.