హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓ సభలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టి న ఘటనపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లిద్దరూ అసూయతో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వెల్లువలా వస్తున్న ప్రజా స్పందనను చూసి దివంగత ఎమ్మెల్యే, తన భర్త మాగంటి గోపీనాథ్ మరణాన్ని తలచుకొని ఆమె ఆ సమయంలో కంటతడి పెట్టారు. ఆడబిడ్డ కన్నీళ్లను చూస్తే ఏ కులంవారైనా, ఏ మతం వారైనా చలించిపోతారు. అయ్యో పాపం! అంటూ సానుభూతి కనబరుస్తారు. ఇది కనీస మానవత్వం. కానీ కాంగ్రెస్ పెద్దలు మనిషితత్వాన్నే మరిచారు. రాజకీయాల కోసం మానవత్వాన్నే మంటగలిపారు. భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డ వేలా ది మంది అభిమానుల ముందు ఆయన్ని తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు.
ఇలాంటి వేలాది బహిరంగ సభల్లో పాల్గొన్న తన భర్త ఇప్పుడు లేకపాయె! అన్న బాధతో ఆమె కన్నీ టి పర్యంతమయ్యారు. తాను దూరమైనా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి పోయారని త లుచుకుంటూ నోటమాట రాక కుమిలిపోయా రు. రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్‌లో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభావేదికగా బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతాగోపీనాథ్ భావోద్వేగానికి గురైన తీరిది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా హరీశ్‌రావు, తలసాని వంటి మాజీ మంత్రులు ఉన్న వేదికపై ఆమె మాట్లాడాలనుకున్నా తన భర్త గుర్తుకు రావడంతో కన్నీటిపర్యంతాన్ని ఆపుకోలేకపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన సామాన్యులు, కార్యకర్తలు చివరకు కేటీఆర్, హరీశ్‌రావు కూడా చలించిపోయారు. మీడియాలో చూసిన వారు సైతం ఎవరికి వారుగా తమ మనసుల్లో ఆ ఆడబిడ్డపై సానుభూతిని వ్యక్తంచేశారు.
రాష్ట్ర మంత్రులుగా ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన కాంగ్రెస్ నేతలు ఆ కన్నీటిని ఓట్లతో తూకం వేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. మానవత్వాన్ని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు అలవాటైన రీతిలో అడ్డగోలుగా మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ మరణించి కేవలం నాలుగు నెలలే గడిచింది. జీవితాంతం గుర్తుకుండే భర్త మరణాన్ని తలచుకొని రోదించడాన్ని కూడా మంత్రి పొన్నం రాజకీయంగా చూడటం అందరినీ ఆవేదనకు గురిచేస్తున్నది.
కృత్రిమ ఏడుపు అంటూ దిగజారుడు ప్రకటన చేయడంపై మహిళలు పెద్ద ఎత్తున భగ్గుమంటున్నారు. ఇక మంత్రులే ఇలా మాట్లాడితే తానేమైనా తక్కువ తిన్నానా? అంటూ కాంగ్రె స్ అభ్యర్థి నవీన్‌యాదవ్ సైతం మాగంటి గోపీనాథ్ మరణంపై అమానవీయంగా మాట్లాడా రు. ఐదేండ్లకోసారి రావాల్సిన ఎన్నిక ఇప్పుడు రెండేండ్లకే రావడమంటే దైవ నిర్ణయమంటూ గోపీనాథ్ మరణంపై సంకుతిత బుద్ధితో మాట్లాడటం విమర్శలకు తావిస్తున్నది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన హోదా ను, స్థాయిని మరిచి ఒక ఆడబిడ్డ కన్నీటిని రాజకీయ కోణంలో చూడటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ కన్నీళ్ల ను వాడుకుంటుందంటూ.. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నదని తుమ్మల వ్యా ఖ్యానించారు. వాస్తవానికి జూబ్లీహిల్స్‌లో జరిగేది ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతుందా? పైగా అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇవన్నీ తెలిసినా రాజకీయ ఆరోపణలు చేయాలనే దురుద్దేశంతో తుమ్మల.. ఒక ఆడబిడ్డ కన్నీళ్లను అపహాస్యం చేశారని పలువురు విమర్శిస్తున్నారు.
ఒక ఆడబిడ్డ కన్నీళ్లను కూడా వాళ్లు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్లీ అధికారం పొంది ఈ రాష్ర్టాన్ని గతంలో దోచుకున్న తీరుగానే మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
– జూబ్లీహిల్స్ సమావేశంలో మంత్రి తుమ్మల
ఆ ఏడుపుల ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫీషియల్‌గా నువ్వు ఏడ్వాల్సిందేనని వీళ్లు చెబుతున్నట్టుంది. అంతర్గతంగా కొందరు కార్యకర్తలు అమ్మా నువ్వు వేదికలపై ఏడ్వాల్సిందేనని చెప్తున్నరు. కృత్రిమ ఏడుపు అనేది మంచిది కాదు. రాజకీయాలు వేరు, సానుభూతి వేరు. రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటే ఒకరు ఓదారుస్తుంటే.. ఈ డ్రామా అంతా సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది.
– జూబ్లీహిల్స్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో మంత్రి పొన్నం ప్రభాకర్