హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీల ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ జూమ్మీటింగ్ నిర్వహించారు. ఈ సం దర్భంగా డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనలు చేశారు.
డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదేండ్లపాటు క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని, అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని చెప్పారు. ప్రజాప్రతినిధుల బం ధువులకు అవకాశాలు లేవన్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు మళ్లీ అవకాశం ఉండబోదని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. డీసీసీల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులతో వ్యక్తిగత సంభాషణలు నిర్వహించొద్దని మీనాక్షి నటరాజన్ తెలిపారు.