హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని ఇది బీజేపీ, ఎంఐఎం ఆధ్వర్యంలో నడుస్తున్న రేవంత్ కాంగ్రెస్ అని అమెరికాకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా గ్రూప్‌లో కాంగ్రెస్ యూఎస్ఏ స్నేహితుల గ్రూప్ పోస్టు చేసింది. కాంగ్రెస్ కోసం పనిచేసిన అసలైన కార్యకర్తలను జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విస్మరించారని, ప్యారాచూట్ నేతను దిగుమతి చేసుకొని టికెట్ ఇచ్చారని విమర్శించారు.
గతంలో ఎంఐఎం టికెట్ మీద పోటీచేసిన నవీన్ యాదవ్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొని టికెట్ ఇవ్వటం సిగ్గుచేటని మండిపడ్డారు. అభ్యర్థి నేపథ్యం ఏమిటో గూగుల్‌లో కొట్టి చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి తిరిగి సమయం వృథా చేసుకోవద్దని వారు మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు.