Leopard | రాజస్థాన్‌లో చిరుత (Leopard) కలకలం రేపింది. ఏకంగా మంత్రి అధికారిక నివాసంలోకి (Rajasthan Ministers House) ప్రవేశించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ చిరుతని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
జలవనరుల శాఖ మంత్రి సురేష్ సింగ్ రావత్ (Suresh Singh Rawat) నివాసంలోకి చిరుత చొరబడ్డట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆయన నివాసం రాజధాని జైపూర్ (Jaipur)లోని వీవీఐపీ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటుంది. అత్యంత హై సెక్యూరిటీ జోన్లో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా అనేక మంది ప్రముఖులు నివసిస్తుంటారు. బంగ్లా నంబర్ 11లో రావత్ నివాసం ఉంటున్నారు. ఆ బంగ్లాకు సమీపంలోనే రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, పలువురు మంత్రుల అధికారిక ఇళ్లు ఉంటాయి.
ఇంతటి హై సెక్యూరిటీ జోన్లోకి చిరుత ప్రవేశించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రెస్క్యూ బృందం వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని చిరుత కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. చిరుత కోసం మంత్రి నివాసంతోపాటూ సమీపంలోని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. దాదాపు గంటపాటూ శ్రమించి చివరికి చిరుతను పట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.
#WATCH | Jaipur, Rajasthan: A leopard was captured in the VVIP Civil Lines area after a 2-hour rescue operation. The forest team tranquillises the animal to capture it. pic.twitter.com/72mR56j5fw
— ANI (@ANI) November 20, 2025
Also Read..
Supreme Court | బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం : సుప్రీంకోర్టు