Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు (Bomb threat) మరోసారి కలకలం రేపాయి. నగరంలోని ఓ పాఠశాలకు గురువారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాలకు (Sanskriti School) బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది.
అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ బెదిరింపు బూటకమని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A bomb threat email was received at Sanskriti School, Chanakypuri, this morning. Nothing suspicious was found following the search operation. Police personnel present at the school: Delhi Police pic.twitter.com/1XG9HOdzY4
— ANI (@ANI) November 20, 2025
కాగా, రెండు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని పలు కోర్టులు, పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. సాకేత్ కోర్టు, పాటియాలా హౌస్ కోర్టు, తీస్ హజారీ కోర్టు సహా ఇతర జిల్లా కోర్టులకు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు నగరంలోని ద్వారకా, ప్రశాంత్ విహార్ ప్రాంతాల్లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను (CRPF schools) లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు.
Also Read..
Leopard | మంత్రి నివాసంలోకి చొరబడ్డ చిరుత.. అధికారులు అలర్ట్
Supreme Court | బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం : సుప్రీంకోర్టు