హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదల(Upasana Konidela).. ఇటీవల ఐఐటీ హైదరాబాద్ ఈవెంట్లో ఎగ్ ఫ్రీజింగ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. అయితే ఆ వివాదం నేపథ్యంలో ఆమె మళ్లీ స్పందించారు. ఎక్స్ అకౌంట్లో తన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఓ పోస్టు చేశారు. కెరీర్‌పై దృష్టి పెట్టే మహిళలు.. తమ ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకోవాలని, ఆ తర్వాత తమకు నచ్చిన సమయంలో గర్భాన్ని దాల్చాలని ఉపాసన సలహా ఇచ్చింది. ఆ సలహాపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. డాక్టర్లు, ఇన్ఫ్లూయన్సెర్లు, సోషల్ మీడియా యూజర్లు ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యల పట్ల స్పష్టత కావాలని కొందరు ఆన్లైన్లో ఆమె అడిగారు.
ఈ నేపథ్యంలో ఉపాసన మళ్లీ ఎగ్ ఫ్రీజింగ్ గురించి స్పందించారు. అండాల సంరక్షణపై ఆరోగ్యకరమైన చర్చ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. తన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు దారితీయడం సంతోషకరమని అన్నారు. ప్రజల స్పందన గౌరవిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల కలిగే లాభనష్టాల గురించి ఆమె వెల్లడించారు. తన వ్యక్తిగత అనుభవాలను ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. పెళ్లి, ఫలదీకరణ గురించి ఆమె తన పోస్టులో రాశారు. తనకు 27 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, తన ఇష్టపూర్వకంగా జరిగిందని, 29 ఏళ్ల వయసులో వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా తన అండాలను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని, 36 ఏళ్ల వయసులో తనకు తొలి సంతానం కలిగిందని, 39 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు ఉపాసన తన పోస్టులో తెలిపారు. పెళ్లి, కెరీర్ మధ్య పోటీ సహజమే అని, కానీ నిండు జీవితంలో అవి రెండు ముఖ్యమే అని, అయితే నేను ఆ రెండింటికి టైం ఫిక్స్ చేసుకున్నానని, తన హక్కును తాను వినియోగించుకున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.
మర్యాదపూర్వకంగా స్పందిస్తున్న తన ఫాలోవర్లకు ఉపాసన థ్యాంక్స్ చెప్పింది. ఉద్యోగ సంస్థలు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కెరీర్ కౌన్సిలింగ్లో మాట్లాడుతూ.. మహిళలకు అతిపెద్ద బీమా తమ అండాలను ఫ్రీజ్ చేసుకోవడమే అని ఆమె అన్నారు. ఎందుకంటే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్న అంశాలపై నిర్ణయం తీసుకోవడం సులువు అవుతుందన్నారు. ఆర్థికంగా బలోపేతం అయిన తర్వాత ఆ నిర్ణయాలను అమలు చేయవచ్చు అని ఆమె అన్నారు. ఎంత మంది పెళ్లి చేసుకోవాలని విద్యార్థులను ఉపాసన ప్రశ్న అడిగిన సమయంలో.. అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ మంది చేతులు లేపారు. దీనిపై ఉపాసన స్పందిస్తూ.. ఇది ప్రగతిశీల భారత్‌కు నిదర్శనమన్నారు.
ఉపాసన చేసిన ఆ సూచన వల్ల ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. తన సలహా జీవసంబంధమైన పరిమితులకు భిన్నంగా ఉన్నట్లు కొందరు విమర్శకులు పేర్కొన్నారు. ఫెర్టిలిటీ చికిత్స సులువైన అంశం కాదన్నారు. ఐవీఎఫ్, ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ స్పందిస్తూ .. బ్యాంకుల్లో కోట్లు ఉన్నవాళ్లు ఎగ్ ఫ్రీజింగ్ గురించి సలహా ఇవ్వడం సులువే అన్నారు. ఐవీఎఫ్ చికిత్సకు లక్షలు ఖర్చు అవుతోందన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రతి ఏడాది లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. ఒక్క సిట్టింగ్ కూడా ఖర్చు చేయలేని మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ అండాలను ఫ్రీజ్ చేసినా.. అవి చివరకు విజయవంతంగా గర్భం దాల్చేం అవకాశం ఉంటుందో లేదో చెప్పలేమని మరో గైనిక్ డాక్టర్ అన్నారు.
I’m happy to have sparked a healthy debate & thank your for your respectful responses.
Stay tuned as I voice my opinions on the pleasures/pressures of privilege – that u all have been talking about.
Don’t forget to check out my images ! It has very important facts that will… pic.twitter.com/rE8mkbnUPW— Upasana Konidela (@upasanakonidela) November 19, 2025