Lava AGNI 4 | భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా మొబైల్స్ మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అగ్ని 4 పేరిట ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1.5 కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా ఈ ఫోన్‌కు గాను 2400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉంది. అందువల్ల ఈ ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు.
ఈ ఫోన్లో గేమ్ బూస్టర్ అనే ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. ఇది గేమర్స్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఇందులో ఎలాంటి బ్లోట్ వేర్‌ను అందించడం లేదని, క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ లభిస్తుందని, ఈ ఫోన్‌కు 3 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో ఏఐ ఫీచర్లను ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇందుకు గాను లావా మొబైల్స్ ప్రత్యేకంగా తొలిసారిగా వాయు ఏఐ అనే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నారు. దీన్ని సిస్టమ్ లెవల్ ఏఐగా అందిస్తున్నారు. హోమ్ స్క్రీన్ నుంచి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. వాయు ఏఐ ని భారతీయ పౌరుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు లావా మొబైల్స్ తెలిపింది.
వాయు ఏఐలో భాగంగా యూజర్లు సర్కిల్ టు సెర్చ్ ఏఐ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. విద్యార్థుల కోసం ఇందులో ఎడ్యుకేషన్ ఏఐ ని అందిస్తున్నారు. దీని సహాయంతో గణితం, ఇంగ్లిష్ పాఠాలను విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే రాశి ఫలాల కోసం ఏఐ హోరో స్కోప్‌ను ఇచ్చారు. కాల్స్ కోసం ఏఐ కాల్ సమ్మరీ, ఏఐ టెక్ట్స్ అసిస్టెంట్ ఫీచర్లను ఇచ్చారు. ఫొటోల ఎడిటింగ్ కోసం ఇందులో ఏఐ ఫొటో ఎడిటర్, ఏఐ ఇమేజ్ జనరేటర్ టూల్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ అల్యూమినియం అలాయ్ మెటల్ ఫ్రేమ్‌ను, సూపర్ యాంటీ డ్రాప్ డైమండ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. కనుక ఫోన్‌కు ప్రీమియం లుక్ రావడంతోపాటు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. అలాగే ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌కు గాను ఓ యాక్షన్ కీని సైతం ఇచ్చారు. దీన్ని యూజర్లు తమకు కావల్సిన యాప్‌కు షార్ట్ కట్‌గా ఉపయోగించుకోవచ్చు. 100కు పైగా షార్ట్ కట్స్‌ను దీనికి కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరా, టార్చ్, మ్యూట్ వంటి టూల్స్‌ను ఈ యాక్షన్ కీకి సెట్ చేసుకుని సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను కేవలం 19 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను కేవలం 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సింగిల్ మోడల్లోనే లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అలాగే ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్ కూడా ఉంది. ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ ఫోన్‌కు యూజర్ ఇంటి వద్దే సర్వీస్ అందించేలా ఉచిత హోమ్ రీప్లేస్మెంట్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇది ఫోన్ వారంటీలో భాగంగా లభిస్తుంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో నవంబర్ 25 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఆఫర్ ను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను ఏ బ్యాంకుకు చెందిన కార్డుతో కొన్నా సరే రూ.2వేల డిస్కౌంట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్‌ను రూ.22,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.