ముంబై: రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా 1400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. గతంలోనూ ఈ కేసుతో లింకున్న సుమారు 7500 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను మనీల్యాండరింగ్ కేసుతో జత కలిపారు. దీనిలో భాగంగానే కొత్తగా 1400 కోట్ల ఆస్తులను ఆ కేసుతో లింక్ చేశారు. మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారమే ఈ ఆదేశాలు ఇచ్చారు.
అయితే ఈడీ తీసుకున్న తాజా నిర్ణయంపై ఇప్పటి వరకు రిలయన్స్ గ్రూపు స్పందించలేదు. తాజాగా 1400 కోట్లు జోడించడంతో..ఈ కేసులో అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు 9000 కోట్లకు చేరుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.