బెంగుళూరు: 3I/ATLAS తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబూలోని 1.2 మీటర్ల టెలిస్కోప్‌కు ఆ తోకచుక్క చిక్కింది. ఈనెలలోనే ఆ తోకచుక్కను తమ కెమెరాల్లో బంధించినట్లు ఇస్రో వెల్లడించింది. చాలా వైభవంగా వెలుగుతున్న న్యూక్లియస్ చుట్టూ బ్లూ-గ్రీన్ రంగులో వలయం ఉన్నట్లు గుర్తించారు. అయితే సౌర కుటుంబం దిశగా దూసుకువస్తున్న సమయంలో ఆ తోకచుక్క చుట్టు ఉన్న వాయు గోళం, ధూళి క్రమంగా విస్తరిస్తుంటుంది. 3I/ATLAS తోకచుక్క మన సౌరకుటుంబానికి అవతలే ఉన్నా.. అది మన సౌర వ్యవస్థలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నదని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సాధారణ తోకచుక్కలతో పోలిస్తే 3I/ATLAS భిన్నంగా ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో సౌర వ్యవస్థకు చెందిన తోకచుక్కను గుర్తించడం ఇది మూడోసారి. 2017లో ఓముమౌమా, 2019లో బోరిసోవ్ తోకచుక్కలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్‌గా గుర్తించే తోకచక్కలు సుదూర నక్షత్ర మండలం నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. నాసా కూడా ఆ తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్‌లను రిలీజ్ చేసింది. మార్స్ రికన్నైసెన్స్ ఆర్బిటార్ కెమెరాలు అక్టోబర్ 2న తీసిన ఫోటోలను బుధవారం నాసా రిలీజ్ చేసింది.
వాస్తవానికి 3I/ATLAS అనే తోకచుక్క అంతుచిక్కనీ రీతిలో ప్రవర్తిస్తున్నది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు తీవ్ర మేధోమథనంలో పడ్డారు. మిస్టీరియస్‌గా మారిన ఆ తోకచుక్కను సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. క్రమంగా ఆ పదార్ధం తన వేగాన్ని పెంచుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అది రంగు కూడా తీవ్ర స్థాయిలో మార్చుకున్నట్లు పసికట్టారు. చిలీలో ఉన్న టెలిస్కోప్ ద్వారా ఆ తోకచుక్క జూలైలో మొదటిసారి గుర్తించారు. అయితే మన సౌర వ్యవస్థ అవతల ఉన్న అతిధిగా దీన్ని భావిస్తున్నారు.
Physical Research Laboratory (PRL) used its 1.2 m telescope at Mount Abu to observe the interstellar comet 3I/ATLAS post-perihelion.
For more information visithttps://t.co/hGs5FcDa44
#SpaceScience #Astronomy #DOS pic.twitter.com/ZgywJbWfm9
— ISRO (@isro) November 19, 2025