Kurnool Bus Accident | కర్నూలు బస్సు దుర్ఘటనను మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్‌ప్రెస్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సైడ్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు.
మరోవైపు హైదరాబాద్ మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో బయల్దేరిన న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
బ్రేకింగ్ న్యూస్
కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
పెద్ద అంబర్ పేట్ వద్ద ORR నుంచి కిందకు బోల్తా పడిన న్యూగో ఎలక్ట్రికల్ బస్సు
బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు.. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
మియాపూర్ నుంచి గుంటూరు… pic.twitter.com/mBfKNumpnN
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025