Chiranjeevi | సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాతో తిప్పలు తప్పడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా తమ పేరు, ఫొటోలు దుర్వినియోగం అవుతుండటంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నెట్టింట తమ పేర్లు, ఫొటోలు, వాయిస్ దుర్వినియోగం అవుతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్తో ప్రతిష్ఠ దెబ్బతింటోందని వాపోతున్నారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి తన పేరు, ఫొటోలు దుర్వినియోగంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చిన సిటీ సివిల్ కోర్టు చిరంజీవి పేరు, ఫొటో, వాయిస్, చిత్రాలు అనుమతి లేకుండా వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది.
చిరంజీవి పేరును కమర్షియల్ బెనిఫిట్స్ కోసం వాడకూడదని ఆదేశించిన కోర్టు.. మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఏఐ మార్ఫింగ్ చేయడంపై ఆంక్షలు విధించింది. టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు చిరంజీవి పేరు, ఫొటోలు దుర్వినియోగం చేసిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.
కాగా ఈ నెల 11న హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశాడు చిరంజీవి. ఇప్పటికే ఏఐ ఎఫెక్ట్‌తో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆశాభోస్లే, రజినీకాంత్, అక్కినేని నాగార్జున కోర్టులను ఆశ్రయించారని తెలిసిందే.
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!