Srinu Vaitla | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కామెడీ మరియు కమర్షియల్ చిత్రాల స్టార్ డైరెక్టర్‌గా ఆయన పేరు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచింది. మహేష్ బాబుతో తెరకెక్కిన ‘దూకుడు’ సినిమా ఆయన కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచింది. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయాయి. కొన్ని చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గోపిచంద్‌తో చేసిన ‘విశ్వం’ కూడా అంతగా అలరించలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో శ్రీను వైట్ల తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌తో శ్రీను వైట్ల సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.
దర్శకుడు శర్వానంద్‌కు వినిపించిన కథలో కమర్షియల్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ కంటెంట్ పరిపూర్ణంగా సెట్ చేసినట్లు తెలుస్తోంది. కథ విన్న శర్వానంద్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు రెడీ అయ్యారట. ఈ సినిమాతో శ్రీను వైట్ల తన పూర్వ వైభవాన్ని తిరిగి అందుకోవడానికి ప్రయత్నించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతానికి శర్వానంద్ .. సంపత్ నందితో ‘భోగి’ అనే పాన్ ఇండియా కమర్షియల్ ఎంటర్టైనర్పై పని చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే ‘నారి నారి నడుమ మురారి’ సినిమా కూడా చేస్తున్నారు . ఇది రామ్ అబ్బరాజు దర్శకత్వంలోరూపొందుతుంది.
బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘బైకర్’ అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా శర్వానంద్ నటిస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల తర్వాతే శ్రీను వైట్ల-శర్వానంద్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్ అభిమానులు ఈ కాంబినేషన్ నుండి భారీ ఎంటర్టైన్మెంట్ కోసం నిరీక్షిస్తున్నారు.కొన్నాళ్ల క్రితం శ్రీను వైట్ల సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్ చాలా డ్రాప్ అయింది. ఇలాంటి సందర్భంలో శర్వానంద్ చిత్రం ఆయనకు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.