Manne Krishank | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అహ నా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నాడు అని క్రిశాంక్ ఎద్దెవా చేశారు. కంటోన్మెంట్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచి, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కూడా అదే చేస్తున్నాడు అని క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి, మంత్రులు కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసినట్లు, జూబ్లీహిల్స్ ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్‌కు కేంద్రం నుండి రూ.1000 కోట్లు తెస్తా అన్నాడు.. ఒక్క కోటి అయినా తెచ్చాడా? ఎలివేటెడ్ కారిడార్ కోసం ఆర్మీ వాళ్లు వాళ్ల భూములు ఇస్తే ప్రభుత్వం దానికి పరిహారం కింద డబ్బులు ఇచ్చింది. అవి కంటోన్మెంట్ భూములకు వచ్చిన డబ్బులు.. ఆ డబ్బులను కూడా నిధులు తెచ్చాం అని దొంగ మాటలు మాట్లాడుతున్నారు. 2022లో బండి సంజయ్ కంటోన్మెంట్‌కు రూ.700 కోట్లు తెస్తానని అన్నాడు.. 7 రూపాయలు కూడా తేలేదు అని మన్నె క్రిశాంక్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ పట్టా అన్నా ఇచ్చారా.. మీరు ఇచ్చాము అంటేనే జుబ్లీహిల్స్‌లో ఓటు అడగండి. కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6 వేల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి గారు చెప్పారు.. 6 ఇళ్లు కూడా ఇవ్వలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 23 కోట్లు శాంక్షన్ అయిందని మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే చెప్పాడు. కానీ అక్కడ మాత్రం ల్యాండ్ ఖాళీగా ఉంది.. అలా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోళ్లను చేశారు. సంవత్సరం నుండి కంటోన్మెంట్‌కు ఏమీ రాలేదు కానీ.. మా ఎమ్మెల్యేకి మాత్రం బెంజ్ కార్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు మా కంటోన్మెంట్ ప్రజలకు వచ్చింది ఇది అని కోడిని చూపించారు మన్నె క్రిశాంక్.
స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 23 కోట్లు శాంక్షన్ అయిందని మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే చెప్పాడు
కానీ అక్కడ మాత్రం ల్యాండ్ ఖాళీగా ఉంది.. అలా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోల్లను చేశారు
సంవత్సరం నుండి కంటోన్మెంట్‌కు ఏమీ రాలేదు కానీ.. మా ఎమ్మెల్యేకి మాత్రం బెంజ్ కార్ వచ్చింది
కాంగ్రెస్… pic.twitter.com/we3cMjruMr
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025