Alana King : దేశం తరఫున ఆడితే చాలు తమ కల సాకారమైందని మురిసిపోతారు క్రికెటర్లు. అంతర్జాతీయ వేదికలపై జట్టును గెలిపించే ప్రదర్శన చేశారంటే వారి ఆనందానికి హద్దులే ఉండవు. ఇప్పుడు ఆస్ట్రేలియా స్పిన్నర్ అలనా కింగ్ (Alana King) సైతం అలాంటి సంచనల ప్రదర్శనతోనే నెట్టింట వైరలవుతోంది. మహిళల ప్రపంచ కప్‌లో ఆసీస్ విజయాల్లో కీలకం అవుతున్న ఈ స్పిన్నర్… చివరి లీగ్ మ్యాచ్‌లో సంచలనం సృష్టించింది. హిట్టర్లతో నిండిన దక్షిణాఫ్రికాను బెంబేలెత్తిస్తూ వికెట్ల వేటతో చెలరేగింది.
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఒకే వికెట్ తీసిన అలనా కింగ్ ఈసారి దక్షిణాఫ్రికా భరతం పట్టింది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసిన కింగ్ ఏడు వికెట్లతో నయా చరిత్ర లిఖించింది. ప్రపంచ కప్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది. ఏడు ఓవర్లలో రెండు మేడిన్ చేసి.. 18 పరుగులే ఇచ్చి.. ఏడు వికెట్లు కూల్చిందీ స్పిన్నర్. తద్వారా మహిళల వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మరో ఘనత సొంతం చేసుకుందీ క్వీన్.
First seven-wicket haul in the Women’s @cricketworldcup belongs to Alana King 👸
Watch #AUSvSA LIVE in your region, #CWC25 broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29 pic.twitter.com/XgePPEEOUV
— ICC Cricket World Cup (@cricketworldcup) October 25, 2025
వన్డే ప్రపంచ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు అలనా కింగ్ సొంతం చేసుకోగా.. వన్డేల్లో మాత్రం పాక్ బౌలర్ సజిదా షా (Sajjida Shah) టాప్‌లో ఉంది. 2003లో తను.. జపాన్ జట్టుపై ఏడు పరుగులకే నాలుగు వికెట్లు తీసింది. డెన్మార్క్‌పై 7/8 ప్రదర్శన కనబరిచిన జో ఛాంబెర్లెన్ (ఇంగ్లండ్) రెండో స్థానంలో ఉంది. 2011లో పాకిస్థాన్‌పై ఏడు పరుగులకే 14 వికెట్లు తీసిన అనిసా మొహమ్మద్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఇండోర్‌లో దక్షిణాఫ్రికా నడ్డివిరిచిన అలనా కింగ్.. నాలుగో ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఆసీస్ పేస్ ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ.. 2019లో ఇంగ్లండ్‌పై 7/22తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. కంగారూ టీమ్‌కే చెందిన షెల్లే నిట్చ్కే.. 2005లో ఇంగ్లండ్‌పై 7/24తో ఆరో స్థానంలో నిలిచింది.